Ariyana Glory: డిజిట‌ల్ స్క్రీన్ టూ సిల్వ‌ర్ స్క్రీన్ వ‌యా బిగ్‌బాస్‌.. అరియానా బ‌ర్త్‌డే స్పెష‌ల్‌..

Ariyana Glory: ఓ చిన్న యూట్యూబ్ ఛాన‌ల్ ద్వారా కెరీర్ ప్రారంభించిన అరియానా గ్లోరీ.. అనంత‌రం బిగ్‌బాస్ రియాలిటీ షోతో ఒక్క‌సారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పాపులారిటీ సంపాదించుకుంది. యూట్యూబ్ నుంచి వెండి తెర వ‌ర‌కు అరియానా జ‌ర్నీ కొన‌సాగింది..

Narender Vaitla

|

Updated on: Jan 25, 2022 | 7:50 AM

ఓ చిన్న యూట్యూబ్ ఛాన‌ల్‌లో యాంక‌ర్‌గా కెరీర్ మొదలు పెట్టింది అరియానా గ్లోరీ. అయితే రామ్ గోపాల్ వర్మ‌తో చేసిన ఇంట‌ర్వ్యూతో ఒక్క‌సారిగా అంద‌రి దృష్టి ఈ అమ్మ‌డిపై ప‌డింది.

1 / 5
అప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రికీ తెలియని అరియానా.. వ‌ర్మ పుణ్యామ‌ని ఎక్క‌డ లేని క్రేజ్‌ను సంపాదించుకుంది. వ‌ర్మ ఇంట‌ర్వ్యూకు సంబంధించిన వీడియోలు నెట్టింట అప్ప‌ట్లో తెగ సంద‌డి చేశాయి.

2 / 5
దీంతో అప్పుడే అనుకోని వరంలా అరియానాకు బిగ్‌బాస్ సీజ‌న్ 4 రూపంలో ల‌క్కీ ఛాన్స్ క‌లిసొచ్చింది. ఈ షోతో అప్ప‌టి వ‌ర‌కు డిజిట‌ల్ ప్రేక్ష‌కుల‌కు మాత్ర‌మే తెలిసిన అరియానా.. ఆ త‌ర్వాత బుల్లి తెర ప్రేక్ష‌కుల‌కు కూడా ప‌రియ‌చ‌మైంది.

3 / 5
ఈ షోలో త‌న‌ను తాను ఒక బోల్డ్ వ్య‌క్తిగా ప‌రిచ‌యం చేసుకున్న అరియానా హౌజ్‌లో త‌న‌దైన ఆట‌తీరుతో అంద‌రినీ ఆక‌ట్టుకుంది. అలా టాప్ 5 వ‌ర‌కు  చేరుకుంది. ఇక షో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత అనుభ‌వించి రాజాతో వెండి తెర ప్రేక్ష‌కుల‌ను సైతం ఆక‌ట్టుకుంది.

4 / 5
అన‌తికాలంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న అరియానా పుట్టిన రోజు నేడు. ఈ సంద‌ర్భంగా మ‌నం కూడా ఈ బోల్డ్ బ్యూటీకి బ‌ర్త్ డే విషెస్‌తో పాటు ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా.!

5 / 5
Follow us