
అందాల ముద్దుగుమ్మ నేషనల్ క్రష్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2025 ఈ ముదుగ్గుమ్మకు కలిసొచ్చిన సంవత్సరంగా చెప్పాలి. ఎందుకంటే, ఈ సంవత్సరంలో ఏకంగా ఐదు సినిమాలతో తన అభిమానుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ ఏకంగా వివాహ బంధంలోకి వెళ్లడానికి కూడా తొలి అడుగు వేసింది. దీంతో ఈ సంవత్సరం ఫుల్ జోష్‌గా గడిపేసింది.

ఇక అదే జోష్ ఇప్పటికీ కంటిన్యూ చేస్తూ, చిల్ అవుతుంది ఈ చిన్నది. గత కొన్ని రోజుల నుంచి వరసగా సినిమాలు, షూటింగ్ , మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటూ, బిజీగా గడిపిన ఈ ముద్దుగుమ్మ తాజాగా రోమ్‌లో ప్రత్యేక్షం అయ్యింది. తన స్నేహితులతో కలిసి రోమ్‌కు వెళ్లి ఫుల్ చిల్ అవుతుంది.

ఛలో మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రష్మిక. ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత వరసగా అవకాశాలు అందుకొని, స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటింది.ఇక ఈ మూవీ తర్వాత గీతా గోవిందంతో నేషనల్ క్రష్‌గా మారిపోయింది. దీని తర్వాత పుష్ప మూవీతో పాన్ ఇండియా లెవల్లో మంచి గుర్తింపు సంపాదించుకొని, వరసగా సినిమాలు చేస్తూ, మంచి సక్సెస్‌లు అందుకుంది.

గత కొన్ని రోజుల నుంచి ఈ బ్యూటీ విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉన్నట్లు అనేక రూమర్స్ వచ్చాయి. వీటన్నిటికి చెక్ పెడుతూ, ఏకంగా వీరు పెళ్లికి రెడీ అయ్యి అందరికీ షాకిచ్చారు. ఇక ఈ ముద్దుగుమ్మ తాజాగా విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కలిసి రోమ్ వెకేషన్‌కు వెళ్లినట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ ఈ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో రష్మిక చాలా క్యూట్‌గా ఉంది. అదే విధంగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా రష్మిక తరహాలోనే కొన్ని వెకేషన్ ఫొటోస్ అభిమానులతో పంచుకున్నాడు.