
బాలయ్య ప్రస్తుతం అఖండ 2తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేయాలని ఎండలు కూడా చూడకుండా కష్టపడుతున్నారు NBK. సెప్టెంబర్ 25న అఖండ 2 విడుదల కానుంది.

జూన్ 10న గోపీచంద్ మలినేని సినిమా మొదలు పెట్టనున్నారు బాలయ్య. వీటి మధ్యలో జైలర్ 2 కూడా చేయబోతున్నారని తెలుస్తుంది.ఈ మధ్యే కూలీ షూటింగ్ పూర్తి చేసిన రజినీకాంత్.. అప్పుడే జైలర్ 2ను సెట్స్ మీదకు తీసుకొచ్చారు.

ఈ సినిమాను 2026 సమ్మర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. జైలర్‌లో నటించిన శివరాజ్ కుమార్, మోహన్ లాల్ సీక్వెల్‌లోనూ కంటిన్యూ అవుతున్నారు. అడీషినల్‌గా బాలయ్య ఈసారి స్క్రీన్ షేక్ చేయడానికి వచ్చేస్తున్నారు.

జైలర్ 2లో బాలయ్య పాత్ర దాదాపు 40 నిమిషాలు ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా కోసం 20 రోజుల డేట్స్ ఇచ్చారని.. దీనికోసం 50 కోట్ల పారితోషికం అందుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

జూన్ నుంచి జైలర్ 2కు డేట్స్ ఇచ్చారు బాలయ్య. పార్ట్ 1లోనే రజినీ, బాలయ్య కాంబో మిస్సైంది.. ఈసారి మిస్ అయ్యే సమస్యే లేదు.. బొమ్మ బ్లాక్‌బస్టరే అంటున్నారు నెల్సన్. మరి చూడాలిక.. ఈ కాంబో ఎలా ఉండబోతుందో..?