డాకు మహారాజ్‌గా సంక్రాంతి బరిలో ఆడియన్స్ ముందుకు వచ్చిన నందమూరి బాలకృష్ణ మరో బ్లాక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సక్సెస్‌తో వరుసగా నాలుగు సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకొని రేర్ రికార్డ్ సెట్ చేశారు.

టాలీవుడ్‌లో మరే సీనియర్ హీరోకు సాధ్యం కాని రేంజ్‌లో జోరు చూపిస్తున్నారు నందమూరి బాలకృష్ణ. సెకండ్ ఇన్నింగ్స్‌లో చిరంజీవి కూడా సక్సెస్‌ల విషయంలో తడబడుతున్నారు.

ఖైదీ నెంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చిన చిరు, ఆ సినిమాతో బిగ్ హిట్ అందుకున్నారు. ఆ తరువాత ఒక్క వాల్తేరు వీరయ్య తప్ప మరో బ్లాక్ బస్టర్ హిట్ లేదు. సీనియర్ సెగ్మెంట్‌లో ఉన్న నాగార్జున, వెంకటేష్ కూడా ఈ మధ్య కాలంలో సక్సెస్ విషయంలో తడబడుతున్నారు.

నాగార్జున బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. బాలయ్యతో పాటు సంక్రాంతి బరిలో దిగిన వెంకీ మాత్రం చాలా రోజుల తరువాత మళ్లీ సంక్రాంతి వస్తున్నాంతో మంచి హిట్ అందుకున్నారు.

నాగార్జున బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. బాలయ్యతో పాటు సంక్రాంతి బరిలో దిగిన వెంకీ మాత్రం చాలా రోజుల తరువాత మళ్లీ సంక్రాంతి వస్తున్నాంతో మంచి హిట్ అందుకున్నారు.