Pan India Movies: పాన్ ఇండియా ట్రెండ్ మీద కొత్త కంప్లయింట్స్‌

| Edited By: Phani CH

Oct 19, 2024 | 12:58 PM

పాన్ ఇండియా సినిమాల గురించి మాట్లాడుకుంటే టాలీవుడ్ రేంజ్ బాగా పెరిగిందనే చెప్పాలి.. మార్కెట్‌  హద్దులు దాటేసింది హీరో పారితోషికాలు చుక్కలంటేస్తున్నాయి.. కానీ ఇలాంటి సమయంలో కూడా ఏదో వెలితి ఫీల్ కలుగుతుంది అంటున్నారు ఆడియన్స్‌.. బిగ్ హిట్స్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంటున్నా... మన నేటివిటీ మాత్రం మిస్‌ అవుతుందని ఫీల్ అవుతున్నారు.

1 / 5
పాన్ ఇండియా ట్రెండ్‌లో మన సినిమా రేంజ్‌ పెరిగింది. మార్కెట్‌ కూడా హద్దులు దాటేసింది. హీరో పారితోషికాలు చుక్కలనంటాయి. కానీ ఇంత హడావిడిలోనూ ఆడియన్స్‌ మాత్రం ఏదో వెలితి ఫీల్ అవుతున్నారు. బిగ్ హిట్స్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంటున్నా... మన నేటివిటీ మాత్రం మిస్‌ అవుతుందని ఫీల్ అవుతున్నారు.

2 / 5
బాహుబలితో పాన్ ఇండియా ట్రెండ్‌ను మొదలు పెట్టిన రాజమౌళి ఆ సినిమాను పూర్తిగా మన కల్చర్‌, హిస్టరీ ఆధారంగా తెరకెక్కించి సక్సెస్ అయ్యారు. కానీ ఆ తరువాత నేషనల్ సినిమా ట్రెండ్‌ను కంటిన్యూ చేస్తున్న స్టార్స్‌, అసలు నేటివిటి గురించే పట్టించుకోవట్లేదు. కొత్త ప్రాంతాలను, పరిస్థితులను సృష్టించి అక్కడ జరిగే కథలతో సినిమా చేస్తున్నారు.

3 / 5
ఖాన్‌సార్‌, ఫ్యూచర్‌ కాశీలలో ప్రభాస్‌, ఎర్ర సముద్రం ఒడ్డున్న ఎన్టీఆర్‌,  నరాచీలో యష్‌ ఇలా ఏ పాన్ ఇండియా సినిమా చూసినా... అసలు భూమ్మీద ఎక్కడా లేని వింత ప్రాంతాల్లోనే కథలు నడుస్తున్నాయి. కేవలం జియోగ్రాఫికల్‌ లోకేషన్‌ విషయంలోనే కాదు, అక్కడి అలవాట్లు, కట్టుబాట్ల విషయంలోనూ ప్రజెంట్ సొసైటీతో ఏ మాత్రం సంబంభం లేని కథలే ఇప్పుడు వెండితెర మీద హవా చూపిస్తున్నాయి.

4 / 5

కమర్షియల్‌గా ఇలాంటి సినిమాలు భారీ వసూళ్లనే సాధిస్తున్నాయి. ఆడియన్స్‌ కూడా ఆటవిడుపుగా ఆ ప్రపంచంలో జరిగే కథలు తెలుసుకునేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. కానీ ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే మాత్రం కష్టమన్న టాక్ వినిపిస్తోంది. ఎంతో కొంత నేటివిటి మీద కూడా దృష్టి పెడితే మంచిదన్న సలహాలు వినిపిస్తున్నాయి.

5 / 5

కాంతార, హనుమాన్ లాంటి పాన్ ఇండియా సినిమాల విషయంలో నేటివ్ కథలకు కూడా ఆడియన్స్‌ కోట్లు కురిపించారు. అందుకే కొత్త ప్రపంచంలో జరిగే సినిమాలతో పాటు మన నేటివిటినీ గ్రాండ్‌గా పరిచయం చేసే సినిమాలు కూడా అదే స్థాయిలో వస్తే బాగుటుందంటున్నారు ఆడియన్స్‌.