Sankranthi Movies: కరోనా కేసులు సంక్రాంతి సినిమాలను భయపడుతున్నాయా..?

| Edited By: Prudvi Battula

Jan 10, 2024 | 3:57 PM

రాను రాను కరోనా కూడా మన జీవనంలో భాగంగా మారిపోతుంది. మూడు నాలుగేళ్లుగా మనల్ని వదలకుండా పట్టుకుంది ఈ మహమ్మారి. రెండేళ్లుగా హాయిగా ఉంది.. ఎలాంటి కరోనా లేదులే అనుకుంటున్న తరుణంలో మరోసారి నేనున్నాను అంటూ గుర్తు చేసింది ఈ వైరస్. నన్నప్పుడే మరిచిపోయారా అంటూ తిరిగి వచ్చేసింది.డిసెంబర్ మొదటి వారం నుంచే కరోనా కేసులు మొదలయ్యాయి. మరణాలు కూడా సంభవిస్తున్నాయి. కానీ ఎవరూ పెద్దగా సీరియస్‌గా తీసుకోవడం లేదు.

1 / 5
ఒకప్పట్లా విళయతాండవం అయితే చేయట్లేదు కానీ కచ్చితంగా కరోనా ప్రభావం మాత్రం దేశంలో బాగానే కనిపిస్తుంది. కొన్ని రోజులుగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కేరళలో ప్రస్తుతం అయ్యప్ప స్వాముల దీక్ష సమయం నడుస్తుంది.

2 / 5
శబరిమలైకు భక్తులు పోటెత్తుతున్నారు. అక్కడే కేసులు ఎక్కువగా నమోదవ్వడమే కాదు.. కొందరు మరణించారు కూడా. అక్కడ్నుంచి మిగిలిన రాష్ట్రాలకు కూడా కరోనా కేసులు బాగానే వ్యాప్తి చెందుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కరోనాపై హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయితే ఇలాంటి సమయంలో సినిమా ఇండస్ట్రీపై మళ్లీ కరోనా పంజా పడుతుందేమో అనే భయాలు ఎక్కవైపోతున్నాయి.

3 / 5
ఎందుకంటే 2020, 2021లలో కరోనా కొట్టిన దెబ్బకు ఇంకా కోలుకోలేకపోతున్నాయి కొన్ని ఇండస్ట్రీలు. ముఖ్యంగా బాలీవుడ్‌ను అయితే చావు దెబ్బ కొట్టింది కరోనా. మన తెలుగు ఇండస్ట్రీని కూడా బాగానే దెబ్బతీసింది. ఇదిలా ఉంటే ఇప్పుడున్న కరోనా కేసులు సంక్రాంతి సినిమాలపై ఏదైనా ప్రభావం చూపిస్తాయా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.

4 / 5
దాని మీద ఎవరూ ఫోకస్ చేయట్లేదు కాబట్టి సరిపోతుంది కానీ కేసులు పెరిగితే మాత్రం కచ్చితంగా ప్రజల్లో ఆందోళన రేగడం అయితే ఖాయం. ఇప్పటికే మొన్న న్యూ ఇయర్ పార్టీస్‌ అన్నీ చాలా వరకు ఖాళీగానే కనిపించాయి. హాయిగానే ఇంట్లోనే ఉండి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నారు.

5 / 5
Saindhav OTT

Saindhav OTT