
అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ జోష్లో ఉంది. గతేడాది కార్తీకేయ 2, 18 పేజీస్ చిత్రాలతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న ఈ కేరళ కుట్టి..ఇప్పుడు టిల్లు స్క్వేర్ సినిమాతో ఏకంగా రూ. 100 కోట్లకు పైగా రాబట్టింది.

సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఈ మూవీతో అనుపమ క్రేజ్ మరింత పెరిగింది. విడుదలకు ముందు గ్లామర్ రోల్ అంటూ విమర్శలు వచ్చినా.. తర్వాత మాత్రం బ్యూటీ యాక్టింగ్ పై ప్రశంసుల వచ్చాయి.

గత నాలుగైదు రోజులుగా వరుస ఫోటోషూట్స్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది అనుపమ. మొన్న ఆకుపచ్చ పట్టు చీరలో అచ్చం తెలుగింటి సంప్రదాయంగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత నీలిరంగు ట్రెండీ డ్రెస్ లో సముద్రచేపల కనిపించింది.

ఇక ఇప్పుడు అనుపమ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ఎర్రచీరలో మరింత అందంగా కనిపిస్తూ చిరునవ్వులు చిందిస్తుంది. ఉంగరాల జుట్టుతో కుర్రాళ్ల హృదయాలను మెలిపెట్టేస్తోంది. ఇప్పుడు ఈ ఫోటోలకు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

అఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అనుపమ.. దాదాపు పదేళ్ల తర్వాత రూటు మార్చింది. ఇన్నాళ్లు క్యారెక్టర్ కంటెంట్ ముఖ్యమనుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు గ్లామర్ రోల్స్ కు ఓటేస్తుంది. కథ, పాత్రతోపాటు గ్లామర్ హీరోయిన్ గా కనిపించేందుకు రెడీ అయ్యింది.

గుండెలను ఇలా గిల్లకే లిల్లీ.. ఎర్ర చీరలో అనుపమ స్టన్నింగ్ ఫోటోస్..