
సంక్రాంతి బరిలో బ్లాక్ బస్టర్ హిట్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్ హీరోగా దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకుడు. షార్ట్ టైమ్‌లో లిమిటెడ్ బడ్జెట్‌తో రూపొందించిన ఈ మూవీ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తోంది. బడ్జెట్ పరంగా చూసుకుంటే ఈ సంక్రాంతికి ఇదే బిగ్గెస్ట్ హిట్ అంటున్నారు క్రిటిక్స్.

పదేళ్ల కెరీర్‌లో ఎనిమిది సినిమాలు చేసిన అనిల్ రావిపూడి దాదాపు అన్ని సూపర్ హిట్సే ఇచ్చారు. ఒక్క ఎఫ్ 3 మాత్రమే బిలో యావరేజ్ రేంజ్‌లో పర్ఫామ్ చేసినా... నిర్మాతలకు నష్టాలు మాత్రం రాలేదు. ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేటుతో ఇండస్ట్రీ రికార్డుల లెక్కలు మార్చేస్తున్నారు అనిల్.

అనిల్ రావుపూడి ముఖ్యంగా హీరో ఇమేజ్, బాడీలాంగ్వేజ్‌కు తగ్గ కథలు, వాళ్ల మార్కెట్ తగ్గ బడ్జెట్‌లతో సినిమాలు చేస్తూ కొత్త స్టాండర్డ్స్ సెట్ చేస్తున్నారు.

వరుస సక్సెస్‌లతో సూపర్ ఫామ్‌లో ఉన్న అనిల్‌తో సినిమా చేసేందుకు టాప్ స్టార్స్ కూడా రెడీ అంటున్నారు. ఆల్రెడీ మహేష్ బాబు, బాలకృష్ణ, వెంకీ లాంటి స్టార్స్‌తో సినిమాలు చేసిన అనిల్, నెక్ట్స్ మూవీని మెగాస్టార్‌తో ప్లాన్ చేస్తున్నారు.

కమర్షియల్ సినిమాకు కామెడీ టచ్ ఇస్తూ అనిల్ చేసే మూవీస్ మెగా ఇమేజ్‌కు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతాయంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఈ యంగ్ డైరెక్టర్ ఇండస్ట్రీలో పదేళ్ల జర్నీ పూర్తి చేసుకున్న సందర్భంగా మరిన్ని సక్సెస్‌ఫుల్ సినిమాలతో ఆడియన్స్‌ను అలరించాలని విష్ చేస్తున్నారు.