
బుల్లితెర బ్యూటీ యాంకర్ స్రవంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. టెలివిజన్ ప్రజెంటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్ గా మంచి అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీ అయిపోతుంది.

ఈ అమ్మడు ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో కొన్ని రోజుల పాటు యాంకర్ గా వ్యవహరించింది. తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా యాంకర్ గా చేసి బుల్లితెర ప్రేక్షకుల మనసు దోచుకుంది. అంతే కాకుండా ఇతర ఛానెల్స్ లో సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.

బుల్లితెరపైనే కాకుండా బిగ్ బాస్ నాన్ స్టాఫ్ సీజన్, ఓటీటీ సీజన్ లో కూడా ఈ అమ్మడు పాల్గొంది. కానీ ఈ బ్యూటీకి బిగ్ బాస్ ద్వారా అంతగా గుర్తింపు రాలేదనే చెప్పాలి.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది డిఫరెంట్ లుక్ లో ఉన్న తన ఫొటోలను షేర్ చేస్తూ కుర్రకారును మాయ చేస్తుంటుంది. మొన్న అఘోరి గెటప్ లో దర్శనం ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తాజాగా యేసుభాయి గెటప్ లో కనిపించి అందరినీ ఆశ్చర్య పరిచింది.

తాజాగా యాంకర్ స్రవంతి, ఛావా మూవీలో రష్మిక గెటప్ లో కనిపించింది. ప్రస్తుతం దీనినికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఇది చూసిన నెటిజన్స్ అచ్చం రష్మిక లానే ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.