
టిక్ టాక్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకొని,అప్పుడు ఏకంగా 1.5 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ను సంపాదించుకున్న ముద్దుగుమ్మ దీపికా పిల్లి. ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. తన క్యూట్‌నెస్‌తో ఎంతో మంది మదిని దోచుకుంది.

బుల్లితెరపైకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఓ డ్యాన్స్ షోలో యాకర్‌గా సందడి చేసింది. అంతే కాకుండా బుల్లితెరపై మంచి పాపులారిటీ సొంతం చేసుకొని ఏకంగా సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీ సంపాదించుకుంది.

ఈ ముద్దుగుమ్మ యాంకర్ ప్రదీప్ సరసన అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి సినిమాలో హీరోయిన్‌గా నటించింది. అంతే కాకుండా పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. కానీ ఈఅమ్మడు చేసిన సినిమాలన్నీ చాలా వరకు అంతగా హిట్ అవ్వలేదు, అభిమానుల మనసు దోచుకోలేకపోయాయి.

దీంతో ఈ ముద్దుగుమ్మకు అంతగా గుర్తింపు రాలేదనే చెప్పాలి. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ బ్యూటీ ఎప్పుడూ తన లేటేస్ట్ ఫొటోస్ అభిమానులతో పంచుకుంటూ నెట్టింట సందడి చేస్తుంది.

ఇక తాజాగా ఈ బ్యూటీ పండగ సందర్భంగా మామిడి చెట్ల మధ్య పలు ఫొటోలకు ఫోజులిచ్చింది. అందులో ఈ అమ్మడు అందాలకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. మరి మీరు కూడా ఆ ఫొటోపై ఓ లుక్ వేయండి.