
బ్యూటీ అనసూయ భరద్వాజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. యాంకర్‌గా బుల్లితెరపై సందడి చేసిన ఈ అమ్మడు, అనతి కాలంలో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చి ఫుల్ బిజీ అయిపోయింది. వరసగా సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అంతే కాకుండా స్పెషల్ సాంగ్స్, కీలక పాత్రల్లో నటించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

సోగ్గాడే చిన్నినాయన సినిమాలో చిన్న పాత్రలో కనిపించి నటించిన ఈ ముద్దుగుమ్మ తర్వాత రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా తన నటనతో అందరినీ కట్టిపడేసింది. ఈ సినిమాలోని ఈ పాత్రకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకొని, మంచి ఫేమ్ సంపాదించుకుంది. దీంతో ఈ బ్యూటీకి టాలీవుడ్‌లో వరసగా అవకాశాలు క్యూ కట్టాయి.

దీని తర్వాత మంచి గుర్తింపు తీసుకొచ్చింది అంటే, పుష్ఫ, పుష్ప2 మూవీ అనే చెప్పాలి. ఈ మూవీలో ఈ అమ్మడు దాక్షయణి పాత్రలో విలన్ రోల్‌లో అదరగొట్టింది. ప్రస్తుతం పలు సినిమాల్లో కీలకపాత్రల్లో నటించడమే కాకుండా, కిర్రాక్ బాయిస్, ఖిలాడీ గర్ల్స్ షోకు జడ్జీగా వ్యవహరిస్తుంది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తాజాగా తన కజిన్ కూతురి పెళ్లిలో తెగ సందడి చేసింది. గోరింటాకు వేడుక, గాజుల వేడుకల్లో తన క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ దిగిన ఫొటోస్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయి.

చాలా సింపుల్ లుక్‌లో కనిపిస్తూ, వివాహ వేడుకల్లో చాలా ఏంజాయ్ చేస్తూ కనిపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఆ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.