
అనన్య నాగళ్ల.. 1996 ఆగస్టు 1న తెలంగాణలోని సత్తుపల్లిలో జన్మించింది. న్యాయవిద్యలో పట్టాపొంది నటనపై ఆసక్తితో సినిమాల్లో అడుగుపెట్టింది.

'మల్లేశం' అనే చిత్రంతో వెండితెరకు పరిచయమై.. 'వకీల్‌సాబ్', 'ప్లేబ్యాక్' చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను అలరించింది. సోషల్‌మీడియాలో తరచుగా యాక్టివ్‌గా ఉండే అనన్య.. కొన్ని రోజులుగా ఫొటోషూట్లు చేస్తూ తన అందాలతో అభిమానులతో అలరిస్తుంది.

తెలుగమ్మాయి అనన్య నాగళ్ల.. న్యాయవిద్యలో డిగ్రీ పట్టాపొందింది. 'మల్లేశం' సినిమాతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది.

కెరీర్ తొలినాళ్లలోనే వకీల్ సాబ్ సినిమాతో టాలీవుడ్ పవర్ స్టార్ పవణ్ కల్యాణ్‌తో ఈ స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఈ ముద్దుగుమ్మకు దక్కింది.

ప్రస్తుతం అనేక చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారింది అనన్య నాగళ్ల... అందాల ఆరబోతలో కూడా ముంబై హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ కాదని సిగ్నల్స్ పంపుతుంది.