
బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ ఎంత ఫేమస్ అయ్యిందో అదే స్థాయిలో వివాదాలు మూటగట్టుకుంది. ముఖ్యంగా గ్రాండ్ ఫినాలే రోజున అన్నపూర్ణ స్టూడియో బయట అభిమానుల గొడవ తారా స్థాయికి చేరుకుంది. ఈ గొడవలో పలు వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సులు కూడా ధ్వంసమయ్యాయి.

ఏడో సీజన్‌లో పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిస్తే.. అమర్ దీప్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. అయితే హౌజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అమర్‌తో పాటు అతని కుటుంబ సభ్యులపై దాడికి తెగబడ్డారు కొందరు అభిమానులు.

తాజాగా ఈ గొడవపై మరోసారి స్పందించాడు అమర్. ' ఆరోజు స్టూడియో బయట కొందరు మా అమ్మను, తేజూ(భార్య)ను బూతులు తిట్టారు. చాలా కోపం రావడంతో కారు దిగే ప్రయత్నం చేశాను'

Bigg Boss Amardeep

అందరిలా నేను కూడా సామాన్య కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్నగారు ఆర్టీసీ ఉద్యోగి. సినిమాలో సత్తా చాటాలని ఇండస్ట్రీలోకి వచ్చాను' అంటూ ఇటీవలి ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యాడు అమర్ దీప్.