
మనం చేసిన పని సక్సెస్ అయిందా? కాలేదా? అనే విషయాన్ని ఎవరు చెప్పాలి? ఎప్పుడు చెప్పాలి? ఎలా చెప్పాలి? ఎవరో, ఎప్పుడో, ఎక్కడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

సక్సెస్‌కి సౌండ్ ఎక్కువ. మారుమోగిపోతుంది. లేటెస్ట్ గా పుష్ప ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఎంత సక్సెస్ అయిందో స్పెషల్‌గా ఎవరైనా చెప్పాలా.. ఏంటి.?

అలా తెలిసిపోయిందిగా అందరికీ.. ఎక్కడా తగ్గని హీరో, అభిమానుల ప్రేమాభిమానాలకు తగ్గాడు. అంత పెద్ద మాటను అల్లు అర్జున్ చెప్పారంటే.. ఆయనకు పాట్నా వేదికగా అందిన స్వాగతం అలాంటిది.

అన్నిటినీ కొట్టేయడానికి మన పుష్పరాజ్ రెడీ అవుతున్నారన్నది మైత్రీ మూవీస్ కాంపౌండ్‌లో స్ట్రాంగ్‌గా వినిపిస్తున్న మాట. ఇంతకీ ఇప్పుడు అర్జంటుగా పుష్పరాజ్ బద్ధలు కొట్టాల్సిన రికార్డు ఏంటంటారా?

విడుదలై ఇన్ని గంటలైనా యూట్యూబ్‌లో ఇంకా నెంబర్ వన్ పొజిషన్‌లోనే కంటిన్యూ అవుతోంది. ట్రైలర్ మేనియానే ఇంతగా ఉంటే, డిసెంబర్ 5న థియేటర్లలో వైల్డ్ ఫైర్ ఏ రేంజ్‌లో ఉంటుందోననే ఊహే గూస్‌బంప్స్ తెచ్చేస్తుంది ఫ్యాన్స్ కి.

రాజమౌళి, ప్రశాంత్ వర్మ, నాగవంశీ.. ఒక్కరా ఇద్దరా.. సెలబ్రిటీలంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు పుష్పరాజ్ హార్డ్ వర్క్ ని. ఈ రేంజ్ భారీతనం ఉన్నప్పుడు.. సుక్కు మల్టిపుల్ మ్యూజిక్ డైరక్టర్స్ ని హయర్ చేసి, వర్క్ షేర్ చేయడంలో తప్పేం లేదనే మాట వినిపిస్తోంది.

ట్రైలర్‌లో మీరు విన్న ప్రతి బిట్ ఆర్ ఆర్ నాదేనని గట్టిగానే చెప్పేశారు దేవిశ్రీ ప్రసాద్. పుష్పరాజ్ సిల్వర్‌స్క్రీన్స్ మీద చేయబోయే మేజిక్ కోసం వెయిట్ చేయండి.. అంటూ ఊరిస్తున్నారు మేకర్స్.