
పుష్ప సినిమాతో ప్యాన్ ఇండియన్ కాదు.. ప్యాన్ వరల్డ్ స్టార్ అయిపోయారు బన్నీ. ఈయన మార్కెట్ దేశ విదేశాల్లో పెరిగిపోయింది. అందుకే నెక్ట్స్ చేయబోయే సబ్జెక్టులు కూడా అలాగే ఉండాలని ఫిక్సైపోయారు బన్నీ.

అట్లీతో ప్రస్తుతం ఓ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ చేస్తున్నారు అల్లు అర్జున్. 600 కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు సన్ పిక్చర్స్. త్రివిక్రమ్‌తో చేయాల్సిన ప్రాజెక్ట్ ప్రస్తుతానికి హోల్డ్‌లో పడిపోయింది. బన్నీతో చేయాల్సిన సినిమానే తారక్‌తో ప్లాన్ చేస్తున్నారు గురూజీ.

మరోవైపు అల్లు అర్జున్ కూడా నెక్ట్స్ ప్రాజెక్ట్స్ విషయంలో జాగ్రత్తగా ఉంటున్నారు. అట్లీ తర్వాత ఈయన ఎవరితో పని చేస్తారా అనే సస్పెన్స్‌కు తెర పడిందిప్పుడు. మిన్నల్ మురళీ ఫేమ్ బాసిల్ జోసెఫ్‌తో బన్నీ సినిమా కన్ఫర్మ్ అయ్యేలా ఉందిప్పుడు.

కరోనా టైమ్‌లో ఓటిటిలో వచ్చిన సూపర్ హీరో సినిమా మిన్నల్ మురళి. టొవినో థామస్ హీరోగా నటించిన తెలుగులోనూ మెరుపు మురళిగా డబ్ అయింది. ఇక్కడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత డైరెక్షన్‌కు దూరంగా ఉంటూ.. నటుడిగా బిజీ అయిపోయారు బాసిల్. సూక్ష్మదర్శిని సహా ఎన్నో సినిమాలతో తెలుగు ఆడియన్స్‌కు చేరువయ్యారు.

ఇన్నేళ్ళ తర్వాత అల్లు అర్జున్ కోసం ఓ కథ సిద్ధం చేసారు బాసిల్ జోసెఫ్. ఇది కూడా సూపర్ హీరో నేపథ్యం ఉన్న కథే అని తెలుస్తుంది. గీతా ఆర్ట్స్‌లో అయితే బాసిల్ స్టోరీ లాక్ అయిపోయింది. అయితే అట్లీ తర్వాత బన్నీ దీన్ని పట్టాలెక్కిస్తారా లేదంటే ఇంకా టైమ్ పడుతుందా అనేది మాత్రం సస్పెన్స్. కానీ బాసిల్, బన్నీ సినిమా అయితే పక్కా..!