Reba Monica John: నా మలయాళీ భామ రెబా అంటూ అల్లు అర్జున్ ట్వీట్.. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో తెలుసా ?..
శ్రీవిష్ణు నటించిన సామజవరగమన సినిమాపై ప్రశంసలు కురిపించిన అల్లు అర్జున్. అందులో నటించిన కథానాయిక రెబా మోనికా జాన్‌ను నా మలయాళీ భామా అంటూ ప్రస్తావించారు. దీంతో ఇప్పుడు ఈ మలయాళీ కుట్టి పేరు నెట్టింట ట్రెండ్ అవుతుంది. రెబా మోనికా 1994 ఫిబ్రవరి 4న బెంగుళూరులో జన్మించింది.