
టాలీవుడ్ ప్రేమ పక్షులు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మరి కొన్ని గంటల్లో మూడు ముళ్ల బంధంలోకి అడుగపెట్టనున్నారు. బుధవారం (నవంబర్ 1)న మధ్యాహ్నం సరిగ్గా 2.48 గంటలకు లావణ్య మెడలో వరుణ్ మూడు ముళ్లు వేయనున్నాడు. ఇటలీలోని టుస్కాన్ వేదికగా వీరి వివాహానికి ఏర్పాట్లు గ్రాండ్‌గా జరుగుతున్నాయి.

కాగా ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా మంగళవారం (అక్టోబర్ 31) హల్దీ, మెహెందీ వేడుకలు గ్రాండ్‌గా జరిగాయి. మెగా, అల్లు కుటుంబ సభ్యులు, లావణ్య త్రిపాఠి ఫ్యామిలీ మెంబర్స్ ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. అలాగే హీరో నితిన్- షాలినీ దంపతులు కూడా ఈ వేడుకల్లో భాగమయ్యారు.

వరుణ్, లావణ్య పెళ్లి వేడుకలో రామ్ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్-స్నేహా రెడ్డి చాలా కలర్‌ఫుల్‌గా కనిపించారు. అలా టాలీవుడ్ హీరో నితిన్, ఆయన భార్య షాలిని కూడా స్టైలిష్‌గా కనిపించారు. అయితే ఈ వేడుకల్లో బన్నీ కూతురు అల్లు అర్హ, కుమారుడు అల్లు అయాన్ మరింత స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపించారు

అల్లు అర్హ ఫోటోలను స్నేహా రెడ్డి తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. ఈ ఫొటోల్లో బ్రేక్ ఫాస్ట్ చేస్తూ, కళ్లకు గాగుల్స్ తో ఎంతో స్టైల్‌గా కనిపించింది అర్హ. ఇక బన్నీ సైతం తన కుమారుడు అయాన్‌తో ఉన్న ఫొటోను షేర్ చేశాడు. దీనికి 'మై లిటిల్ క్యూట్ బాయ్' అనే క్యాప్షన్ ఇచ్చాడు.

ఇటలీలో పెళ్లి అనంతరం హైదరాబాద్‌లో నవంబర్ ఐదో తేదీన గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ వేడుకకు టాలీవుడ్, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు.