
బాలీవుడ్ స్టార్స్ అలియా భట్, రణభీర్ కపూర్ తమ గారాల కుమార్తె రాహాతో కలిసి దీపావళి పండగను జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టాలో షేర్ చేసింది అలియా భట్.

లైట్స్, ప్రేమ.. విలువైన క్షణాలు.. దీపావళి శుభాకాంక్షలు అంటూ తన కూతురితో కలిసి పూజ జరుపుకుంటున్న ఫోటోలను షేర్ చేసింది. అందులో రాహా తన తల్లిదండ్రులతో కలిసి హారతిని పట్టుకుని కనిపించింది.

రాహా తల్లిదండ్రులతోనే కాదు.. తన పిన్ని షాహీన్ తో కలిసి ఉన్న మరో ఫోటో కూడా హైలేట్ అయ్యింది. రాహాను తన అమ్మమ్మ, నాన్నమ్మ అల్లారు ముద్దుగా పెంచుతున్నారని అర్థమవుతుంది.

దీపావళి వేడుకలలో అలియా బంగారు చీరలో మెరుస్తుండగా.. రణబీర్, తమ కూతురు రాహా కూడా ఒకే రంగు దుస్తులు ధరించి స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. ప్రస్తుతం నెట్టింట అలియా, రాహా, రణభీర్ ఫోటోస్ అట్రాక్ట్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే.. ఇటీవలే జిగ్రా సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది అలియా. ఇందులో వేదంగ్ రైనా కీలకపాత్ర పోషించారు.ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న లవ్ అండ్ వార్ చిత్రంలో నటిస్తున్నారు అలియా, రణబీర్.