ప్రస్తుతం తెలుగు తెరపై కొత్త అందాలు సందడి చేస్తున్నాయి. కొత్తవాళ్లను ప్రోత్సహించడంలో మన స్టార్ హీరోస్ ఎప్పుడూ ముందుంటారు అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐశ్వర్య లక్ష్మి, ఆషికా రంగనాథ్, సంయుక్త వంటి హీరోయిన్స్ హిట్స్ అందుకున్నారు.
ఇక ఇప్పుడిప్పుడే మరికొందరు ముద్దుగుమ్మలు రాబోతున్నారు. సాక్షి వైద్య, గౌరీ జీ కిషన్ వంటి హీరోయిన్స్ త్వరలోనే తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. ఈ క్రమంలోనే మరో కొత్త బ్యూటీ సందడి చేయబోతుంది.
కొత్తవాళ్లను ప్రోత్సహించడంలో ముందుంటే టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఈసారి మరో ముద్దుగుమ్మను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారట. తనే మాజీ మిస్ ఇండియా వరల్డ్ మానస వారణాసి.
కొత్తవాళ్లను ప్రోత్సహించడంలో ముందుంటే టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఈసారి మరో ముద్దుగుమ్మను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారట. తనే మాజీ మిస్ ఇండియా వరల్డ్ మానస వారణాసి.
ఇప్పటికే ఇద్దరిపైనా ఫోటో షూట్ కూడా పూర్తయిందని టాక్ వినిపిస్తోంది. తెలుగులో సినిమా చేసేందుకు మానస కూడా ఆసక్తి చూపిస్తుందని.. అందుకే నాగార్జున లాంటి పెద్ద హీరోతో తెరంగేట్రం చేయాలని ఈ సినిమాకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.
వీరిద్దరి కాంబోలో రాబోయే చిత్రానికి మరొ కొత్త వ్యక్తి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. కథ, స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని.. త్వరలోనే ముహుర్తం కూడా ఫిక్స్ చేయనున్నారని.. ఈసినిమాకు సంబంధించిన అన్ని విషయాలను త్వరలోనే అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది.
నాగార్జున సరసన మరొ కొత్త ముద్దుగుమ్మ ?.. మాజీ మిస్ ఇండియాకు లక్కీ ఛాన్స్..
నాగార్జున సరసన మరొ కొత్త ముద్దుగుమ్మ ?.. మాజీ మిస్ ఇండియాకు లక్కీ ఛాన్స్..