Akhil Akkineni: ప్రియురాలు జైనాబ్‌ రవ్జీతో అఖిల్ అక్కినేని పెళ్లి.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే..

Updated on: Jun 06, 2025 | 1:51 PM

అక్కినేని నాగార్జున నటవారసుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి ఇప్పుడు సరైన సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు అఖిల్ అక్కినేని. ఇప్పటివరకు ఈ హీరో నటించిన చిత్రాలన్నీ ప్లాప్స్ కావడంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు ఈ హీరో.

1 / 5
అక్కినేని అఖిల్ తన బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియురాలు జైనాబ్ రవ్జీతో కలిసి ఈరోజు తెల్లవారుజామున మూడు గంటలకు ఏడడుగులు వేశారు అఖిల్. వీరిద్దరి పెళ్లి వేడుక నాగార్జున నివాసంలో ఘనంగా జరిగింది.

2 / 5
వీరి పెళ్లికి ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, డైరెక్టర్ ప్రశాంత్ నీల్, సుమంత్, సుశాంత్ తదితరులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, పెళ్లి వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

3 / 5
అయిత అఖిల్ పెళ్లి చేసుకున్న తర్వాత జైనాబ్ రవ్జీ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. జైనాబ్ హైదరాబాద్‌కు చెందిన కళాకారిణి. ప్రముఖ పారిశ్రామికవేత్త జుల్ఫీ రావడ్జీ కూతురు. సోషల్ మీడియాలో బ్లాగర్, బేస్పోక్ పరఫ్యూమర్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు జైనాబ్.

4 / 5
హైదరాబాద్ మూలాలున్న జైనాబ్ ప్రస్తుతం ముంబైలో సెటిల్ అయ్యారని సమాచారం. ముంబైలోనే రవడ్జీ ఫ్యామిలీ ఉంటున్నట్లు టాక్. వీరికి దుబాయ్, అరబ్ దేశాల్లో పలు వ్యాపారాలు ఉన్నాయని.. జైనాబ్ ఇప్పుడు సొంతంగా ఆర్ట్స్ గ్యాలరీని నిర్వహిస్తున్నారని సమాచారం.

5 / 5
ఇదిలా ఉంటే.. ఇప్పుడు జైనాబ్ రవ్జీ, అఖిల్ ఇద్దరి మధ్య వయసు వ్యత్సాసం గురించి చర్చ  నడుస్తుంది. ఇద్దరి మధ్య 9 సంవత్సరాలు వయసు తేడా ఉందని సోషల్ మీడియాలో టాక్. అయితే  ఈ విషయం ఎంత వరకు నిజమనేది తెలియరాలేదు.