
'RRR' విడుదలకు ముందే తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబుతో చేస్తానని ప్రకటించారు దర్శక ధీరుడు రాజమౌళి. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన తర్వాత రాజమౌళి, మహేష్‌బాబుల సినిమా స్థాయి భారీగా ఉండడంతో కథ, సినిమాటోగ్రఫీ, సాంకేతికత, ఆర్టిస్టులు అన్నీ మారిపోయాయి. అంతేకాదు ఈ సినిమా బడ్జెట్ 1000 కోట్లకు పెరిగింది.

ఈ సినిమాలో చాలా మంది విదేశీ ఆర్టిస్టులు నటిస్తుండగా, సినిమాలో చిన్న చిన్న పాత్రలకు కూడా స్టార్ నటీనటులను తీసుకుంటున్నారు. ఇప్పుడీ పాన్ వరల్డ్ మూవీలో మరో స్టార్ హీరోయిన్ నటించనున్నట్లు ప్రచారం జరగుతోంది. ఆమె ఎవరో కాదు ఇటీవలే కల్కితో తెలుగు ఆడియెన్స్ ను పలకరించిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె.

కాగా ఇటీవలే తల్లి అయిన దీపికా పదుకొణె ప్రస్తుతం సినిమాలకు విరామం ఇచ్చేసింది. అయితే ఈ బ్రేక్‌లో ఉన్నప్పుడు కూడా కొన్ని సినిమాల కథలు వింటోంది. ఈ క్రమంలోనే ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ అండ్ హయ్యెస్ట్ బడ్జెట్ మూవీలో నటించేందుకు దీపిక ఓకే చెప్పిందని సమాచారం. సాధారణంగా ఏ సినిమాలో అయినా దీపికా లీడ్ రోల్ చేస్తుంది. కానీ మహేష్ సినిమాలో ఆమె లీడ్ రోల్ ప్లే చేయడం లేదు.

రాజమౌళి, మహేష్ బాబు సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్ కాదని అంటున్నారు. ఈ సినిమాలో ఓ విదేశీ నటి కథానాయికగా నటిస్తుండగా, దీపికర్ సపోర్టింగ్ క్యారెక్టర్‌గా నటిస్తుందని సమాచారం. సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి ఇంకా చాలా సమయం ఉంది. దీపికా పదుకొణె ఏడాది తర్వాత టీమ్‌లో జాయిన్ అవుతుంది. దాదాపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న రాజమౌళి ప్రస్తుతం సినిమా కోసం లొకేషన్ వెతికే పనిలో బిజీగా ఉన్నారు.

ఆఫ్రికా వెళ్లిన రాజమౌళి షూటింగ్ స్పాట్స్ ను ఫైనలైజ్ చేసిలో పనిలో ఉన్నారు. దీంతో పాటు ఆర్టిస్టులను ఖరారు చేసే ప్రక్రియ కూడా సాగుతోంది. ఈ సినిమాలో కొందరు హాలీవుడ్ నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్రం చైనీస్, జపనీస్, ఇండోనేషియా, రష్యన్ మరియు భారతీయ భాషలతో సహా అనేక ఇతర భాషలలో ఒకేసారి విడుదల కానుంది. పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ మూవీ రిలీజ్ కానుంది.