
అదితి రావు హైదరీ.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. తెలుగు, తమిళంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.

ముఖ్యంగా డైరెక్టర్ మణిరత్నం సినిమాల్లో కనిపించింది. చెలియా, సమ్మోహనం, అంతరిక్షం, సైకో, హే సినామికా సినిమాలతో గుర్తింపు వచ్చింది.

తాజాగా అదితి రావు షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. ఎల్లో కలర్ షరారా సెట్లో మరింత అందంగా మెరిసిపోతుంది అదితి రావు హైదరీ..

అయితే ఈ షరారా సెట్ ధర తెలిసి అవాక్కవుతున్నారు నెటిజన్స్. అదితి ధరించిన షరారా ధర రూ. 95,000. ఇంతకీ ప్రత్యేకత ఏంటో తెలుసా ?..

ఆమె ధరించిన షరారా.. గోటా, మరోడి, డబ్కాతో అలంకరించబడిన ఘుమర్ జల్ దుపట్టా మొఘల్ వాస్తుశిల్పం నుండి ప్రేరణ పొందింది.