
అదితి రావు హైదరి.. ఈ అందాల భామ ది లెజెండ్ ఆఫ్ మైఖేల్ మిశ్రా అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ బ్యూటీ.

ఆతర్వాత హిందీలో మరో సినిమా చేసింది. సర్దార్ కా గ్రాండ్ సన్ అనే సినిమాలో నటించింది అదితి రావు హైదరి. ఆతర్వాత తెలుగులో ఓ సినిమా చేసింది.

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన చెలియా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ.

ఆతర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సమ్మోహనం సినిమాతో హిట్ అందుకుంది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది.

తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మేపించింది ఈ చిన్నది. తెలుగులో చివరిగా నేచురల్ స్టార్ నాని నటించిన వి సినిమాలో మెరిసింది. ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించింది.