Vaishnavi Chaitanya: బేబీ టైమ్ స్టార్ట్స్.. ఇక చూస్కోండి నా సామిరంగా.! వరసబెట్టి సినిమాలే..

| Edited By: Basha Shek

Jan 04, 2024 | 10:16 PM

ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు అంత ఈజీగా అవకాశాలు రావు.. వచ్చినా ఏదో లక్‌లో ఒకట్రెండు ఛాన్సులు వస్తాయేమో కానీ ఒకప్పట్లా మాత్రం ఇండస్ట్రీలో పదికాలాల పాటు గుర్తుండిపోయే అవకాశాలు మాత్రం రావు అనే టాక్ ఎప్పట్నుంచో నడుస్తుంది. అయితే ఈ మధ్య కొందరు తెలుగు బ్యూటీస్ ఈ నానుడికి చెక్ పెడుతున్నారు. వచ్చి తమదైన టాలెంట్ చూపించడమే కాకుండా.. స్టార్ హీరోయిన్లు కూడా అయిపోతున్నారు. ఈ క్రమంలోనే శ్రీలీల దూకుడు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మరో తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య సైతం అదే దూకుడు చూపిస్తుంది.

1 / 9
ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు అంత ఈజీగా అవకాశాలు రావు.. వచ్చినా ఏదో లక్‌లో ఒకట్రెండు ఛాన్సులు వస్తాయేమో కానీ ఒకప్పట్లా మాత్రం ఇండస్ట్రీలో పదికాలాల పాటు గుర్తుండిపోయే అవకాశాలు మాత్రం రావు అనే టాక్ ఎప్పట్నుంచో నడుస్తుంది.

2 / 9
అయితే ఈ మధ్య కొందరు తెలుగు బ్యూటీస్ ఈ నానుడికి చెక్ పెడుతున్నారు. వచ్చి తమదైన టాలెంట్ చూపించడమే కాకుండా.. స్టార్ హీరోయిన్లు కూడా అయిపోతున్నారు. ఈ క్రమంలోనే శ్రీలీల దూకుడు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మరో తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య సైతం అదే దూకుడు చూపిస్తుంది.

3 / 9
నిజానికి బేబీ తర్వాత ఈమెకు కోరుకున్న అవకాశాలు రావట్లేదనే టాక్ కూడా వినిపించింది. ఎందుకు ఈమెపై చిన్నచూపు చూపిస్తున్నారంటూ చర్చ కూడా జరిగింది. కానీ అసలు సీన్ మాత్రం మరోలా ఉంది. ఈ బేబీకి ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ఏకంగా 5 సినిమాలకు సైన్ చేసింది వైష్ణవి చైతన్య.

4 / 9
ఈ సందర్భంగా ఈమె నటిస్తున్న సినిమాల డీటైల్స్ అన్నీ బయటికి వస్తున్నాయి. అందులో పెద్ద బ్యానర్స్ కూడా ఉన్నాయి. సాధారణంగా ఓ బ్లాక్‌బస్టర్ సినిమా వస్తే.. అందులో హీరోయిన్ పంట పండినట్లే. ఇప్పుడు వైష్ణవి విషయంలోనూ ఇదే జరుగుతుంది.

5 / 9
కాకపోతే బేబీ తర్వాత నెక్ట్స్ ఆఫర్ కోసం కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చింది ఈ బేబీ. కొన్నిసార్లు నిదానమే ప్రధానం అంటారు కదా.. అలాగే సాగిపోతుంది బేబీ కెరీర్. బేబీలో తనదైన నటనతో పిచ్చెక్కించింది వైష్ణవి. ఆ సినిమా సంచలన విజయంలో వైష్ణవి చైతన్య పాత్ర మరవలేం.

6 / 9
ఒక్క సినిమాతోనే వైష్ణవి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. తాజాగా ఈమె 5 సినిమాలకు సైన్ చేసినట్లు తెలుస్తుంది. అందులో రెండు సెట్స్‌పైనే ఉన్నాయి. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్ధూ జొన్నలగడ్డ నటిస్తున్న సినిమాతో పాటు..

7 / 9
దిల్ రాజు నిర్మాతగా ఆశిష్ రెడ్డి హీరోగా బింబిసార ఫేమ్ వశిష్ట తమ్ముడు దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమాలోనూ వైష్ణవి హీరోయిన్‌గా నటిస్తుంది. బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలో ముస్లిం అమ్మాయిగా నటిస్తుంది ఈ భామ.

8 / 9
ఈ రెండు సినిమాలతో పాటు మరో మూడు సినిమాల్లోనూ వైష్ణవి పేరు పరిశీలిస్తున్నారు. గ్లామర్ షోకు ఎలాంటి అడ్డు చెప్పదు కాబట్టి ఈ భామకు మరిన్ని ఆఫర్స్ క్యూ కట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం SVCC, దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాణ సంస్థల నుంచి వైష్ణవికి ఆఫర్స్ వచ్చాయి.

9 / 9
దాంతో పాటు బేబీ నిర్మాతలతో మూడు సినిమాల అగ్రిమెంట్ ఉండనే ఉంది. ఇవే కాదు.. బయటి సంస్థల నుంచి కూడా బేబీకి ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. అయితే వీటన్నింటినీ ఎలా యూజ్ చేసుకుంటుందనే దానిపైనే ఈమె కెరీర్ ఆధారపడి ఉంది.