
తాప్సీ పన్నూ. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకుంది ఈ అందాల ముద్దుగుమ్మ.

ఆ తర్వాత టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ అందుకుంటూ అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది. కానీ కొన్నాళ్లుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యింది. ఇప్పుడు అక్కడే సినిమాలు చేస్తుంది.

ప్రస్తుతం తాప్సీ కాంధారి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఆమె ఎలాంటి డూప్ లేకుండా సొంతంగా యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొన్నట్లు సమాచారం.

కిడ్నాపైన తన కూతురిని కాపాడుకునేందుకు ఓ తల్లి చేసే పోరాటం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. దీనిని దేవాశిశ్ మఖిజా తెరకెక్కిస్తుండగా.. కథా పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో తాప్సీ మొదటిసారి తల్లి పాత్రలో కనిపించనుంది. త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే తాజాగా తాప్సీ ఫోటోస్ వైరలవుతున్నాయి.