Taapsee Pannu: కొత్త కారు కొన్న తాప్సి.. ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. ఎన్ని కోట్లంటే..
ఝుమ్మంది నాధం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది తాప్సి. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. అయితే కొంతకాలంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస చిత్రాలతో బిజీ అయ్యింది. ఇటు తెలుగు చిత్రపరిశ్రమకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ మిషన్ ఇంపాజిబుల్ సినిమాతో హిట్ అందుకుంది.
Taapsee Pannu
Follow us on
ఝుమ్మంది నాధం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది తాప్సి. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. అయితే కొంతకాలంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస చిత్రాలతో బిజీ అయ్యింది. ఇటు తెలుగు చిత్రపరిశ్రమకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ మిషన్ ఇంపాజిబుల్ సినిమాతో హిట్ అందుకుంది.
ఓవైపు వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాణ రంగంలోనూ రాణిస్తోంది. హిందీలో పలు చిత్రాలను నిర్మిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే తాప్సీ గ్యారేజీలో ఇప్పటికే పలు ఖరీదైన కార్లు ఉన్నాయి.
ఇప్పుడు కొత్తగా మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ 600 వచ్చి చేరింది. ఆదివారం తాప్సీ ఇంటి వద్ద కొత్త కారును అధికారులు అందించడం జరిగింది.
ప్రస్తుతం ఈ కారు ధర రూ.3.15 కోట్లు అని తెలుస్తోంది. బెంజ్ జీఎల్ఎస్ 600 కారు ధర తెలిసి షాకవుతున్నారు నెటిజన్స్. కారులో అత్యధునిక ఫీచర్స్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉన్నట్లు తెలుస్తోంది.