
కేజీఎఫ్' సిరీస్ సినిమాలతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది నటి శ్రీనిధి శెట్టి. ముఖ్యంగా కేజీఎఫ్2 సినిమాలో ఆమె అభియానికి మంచి పేరొచ్చింది. దీంతో ఈ అమ్మడికి సినిమా అవకాశాలు క్యూ కడతాయని భావించారు.

అయితే కేజీఎఫ్ 2 తర్వాత విక్రమ్ కోబ్రా సినిమాలో మాత్రమే నటించింది శ్రీనిధి. ఇందుకు గానూ ఆమెకు 6-7 కోట్ల రూపాయ రెమ్యునరేషన్ ఇచ్చారట. ఆ తర్వాత కూడా అదే పారితోషకం అడుగుతుండడంతో దర్శక నిర్మాతలు ఆమెను తీసుకోవడానికి సంకోచిస్తున్నారట.

అందుకే ఈ సొగసరికి సినిమా ఛాన్స్ లు రావడం లేదని శాండల్ వుడ్‌లో టాక్ నడుస్తోంది. 2018 సినిమాల్లోకి అడుగుపెట్టిన శ్రీనిధి ఇప్పటివరకు కేవలం 3 సినిమాల్లోనే నటించడం గమనార్హం.

దీంతో ఆమె తర్వాతి సినిమా అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా సినిమాలు చేయకున్నా సోషల్ మీడియాలో మాత్రం తెగ యాక్టివ్‌గా ఉంటోందీ బ్యూటీ. నిత్యం తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలను షేర్ చేస్తుంటుంది.

తాజాగా ఆమె ఓ ఫోటోషూట్‌లో సందడి చేసింది. ఇందులో బ్లాక్ కలర్ డ్రెస్‌తో ఎంతో క్యూట్‌గా కనిపించింది. ప్రస్తుతం శ్రీనిధి ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.