టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల కెరీర్‌లో మరో బిగ్ స్టెప్ తీసుకోబోతున్నారు. ఇన్నాళ్లు తెలుగుతో పాటు కన్నడ సినిమాలు మాత్రమే చేసిన ఈ బ్యూటీ, ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నారు.
ఆల్రెడీ ఓ క్రేజీ ప్రాజెక్ట్‌కు ఈ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల కెరీర్‌లో మరో అడుగు ముందుకు వేస్తున్నారు.
ఆల్రెడీ సౌత్‌లో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. ఓ సక్సెస్‌ఫుల్ హీరోతో క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించేందుకు శ్రీలీల గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది.
ప్రజెంట్ వరుసగా సౌత్ బ్యూటీస్‌తోనే సినిమాలు చేస్తున్నారు వరుణ్ థావన్. సిటాడెల్ వెబ్ సిరీస్‌లో సమంతతో కలిసి నటించారు.
ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న బేబీ జాన్ సినిమాలో కీర్తి సురేష్‌తో జోడి కడుతున్నారు. ఆ తరువాత చేయబోయే సినిమా విషయంలో సౌత్ బ్యూటీకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
డేవిడ్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ట్రయాంగులర్ లవ్ స్టోరిలో హీరోగా నటిస్తున్నారు వరుణ్. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్, శ్రీలీల హీరోయిన్‌గా కనిపించబోతున్నారు.
జూలైలో ప్రారంభం కానున్న ఈ సినిమాను అక్టోబర్‌లోనే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో త్వరలోనే శ్రీలీల బాలీవుడ్ డెబ్యూ ఉండబోతుందన్న న్యూస్ ట్రెండ్ అవుతోంది.