Sneha : 44 ఏళ్ల వయసులో తరగని అందం.. డైట్ ప్లాన్ రివీల్ చేసిన స్నేహా..

Updated on: Dec 31, 2025 | 4:10 PM

తెలుగు అడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న హీరోయిన్లలో స్నేహ ఒకరు. ప్రస్తుతం ఆమె వయసు 44 సంవత్సరాలు. ఇప్పటికీ విభిన్న పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. అందంతోపాటు.. చిరునవ్వుతో కోట్లాది మంది ప్రజలను ఆకట్టుకుంది ఈ అమ్మడు. తాజాగా తన అందానికి రహాస్యాన్ని వెల్లడించింది స్నేహ.

1 / 5
స్నేహ.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. గోపిచంద్ నటించిన తొలి వలపు సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు.. ఆ తర్వాత తెలుగులో అత్యధిక అవకాశాలు అందుకుంది. తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

2 / 5
18 ఏళ్ల వయసులోనే నటిగా సినీ ప్రయాణం స్టార్ట్ చేసింది స్నేహ. తెలుగులో అత్యధిక చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసింది. తమిళ్ నటుడు ప్రసన్న కుమార్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి అమ్మాయి, అబ్బాయి ఉన్నారు.

3 / 5
పెళ్లి తర్వాత కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ తీసుకున్న స్నేహ..  ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. తెలుగులో యంగ్ హీరోల సినిమాల్లో కీలకపాత్రలు పోషించి మెప్పించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్నేహ మాట్లాడుతూ తన ఫిట్నెస్, డైట్ సీక్రెట్స్ రివీల్ చేసింది.

4 / 5
ప్రతి రోజూ శరీరానికి అవసరమైన విభిన్న వ్యాయామాలు చేస్తానని.. బరువు తగ్గేందుకు కూడా వర్కవుట్స్ చేస్తానని తెలిపింది. చిన్నప్పటి నుంచి ఇంట్లో చేసిన ఆహారం అంటే తనకు చాలా ఇష్టమని.. తక్కువ కేలరీలు ఉండే ఆహారాన్ని తీసుకుంటానని చెప్పుకొచ్చింది.

5 / 5
చక్కెర పదార్థాలకు దూరంగా ఉంటానని తెలిపింది. పిండి పదార్థాలు, ఖనిజాలు, ఫైబర్, ప్రోటీన్ ఉండే ఆహారం తీసుకుంటుందట. తల్లైన తర్వాత కూడా శ్వాస వ్యాయామాలు చేశానని.. అలాగే నీరు ఎక్కువగా తీసుకుంటానని తెలిపింది. అధికంగా నీరు తాగడమే చర్మం అందానికి రహస్యమని తెలిపింది.