Shruti Haasan: శ్రుతి హాసన్‌ను వేధిస్తున్నది ఎవరు ?.. కర్మ అనుభవిస్తారు అంటూ పోస్ట్..
ఈ ఏడాది వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలతో ఒకేసారి రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది శ్రుతి హాసన్. ఈ రెండు సినిమాల తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు ఈ బ్యూటీ. ఇక త్వరలోనే ప్రభాస్ సరసన సలార్ సినిమాతో అలరించనుంది. ప్రస్తుతం తెలుగులో ఒకే ఒక్క సినిమా చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో నిత్యం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది శ్రుతి. తన లేటేస్ట్ ఫోటోస్ మాత్రమే కాకుండా.. తన ప్రియుడు శాంతను గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటుంది శ్రుతిహాసన్.