
సినిమా ఇండస్ట్రీలో ఒకటి రెండు సినిమాలతో కనిపించకుండా పోయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఆతరువాత కనిపించకుండా పోయింది. కానీ చేసిన సినిమాలతో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయింది. సినిమాలో బోల్డ్ గా నటించి అందరికి షాక్ ఇచ్చింది.

శ్రీ రాపాక.. ఈ ముద్దుగుమ్మ గుర్తుందా.? ఆర్జీవి పరిచయం చేసిన అందాల భామల్లో ఈ అమ్మడు ఒకరు. తొలి సినిమాతోనే బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది ఈ అమ్మడు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన నగ్నం అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది శ్రీ రాపాక. ఈ సినిమాలో తన అందాలతో ఆకట్టుకుంది.

బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది శ్రీ రాపాక. ఈ సినిమాలో శ్రీ రాపాక సీన్స్ చూసి ఆడియన్స్ షాక్ అయ్యారు. ఈ బ్యూటీకి నగ్నం సినిమా తర్వాత అదే తరహా పాత్రలు రావడం మొదలు పెట్టాయి. కానీ ఆమె అవి చేయడానికి అంతగా ఇష్టపడలేదు. అలాగే బిగ్ బాస్ గేమ్ షోలో పాల్గొని తన ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ భామ.

నగ్నం సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ ఆతర్వాత ‘గులాబీ’, ‘మరణం’ లాంటి సినిమాలు చేసింది. కానీ ఆ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇక శ్రీ రాపాక గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. సినిమాల మీద ఇష్టంతో మోడల్ గా మారి ఆతర్వాత పలు సినిమాలకు ఫ్యాషన్ డిజైనర్ గా పని చేసింది శ్రీ రాపాక. అలాగే చాలా బ్రాండ్లకు పని చేసింది.

గతంలో ఆమె మాట్లాడుతూ.. నగ్నం అనే సినిమాలో నిజంగా నగ్నంగా నటించలేదు. స్కిన్ కలర్ లో కలిసిపోయే డ్రస్ వేసుకున్నాను. అని చాలా మందికి తెలియదు. నగ్నం సినిమా షూటింగ్‌లో నేను, దర్శకుడు ఒక కెమెరామన్ మాత్రమే ఉన్నాం. ఈ సినిమా షూటింగ్ మొత్తం తక్కువ మందితోనే జరిగింది. ఒకవేళ నేను నిజంగానే నగ్నంగా కనిపిస్తే రాంగోపాల్ వర్మ ఊరుకుంటాడా..? వెంటనే మియా మాల్కోవతో సినిమా చేసినట్టు.. నా అందాలు చూపిస్తూ యాంగిల్స్ పెట్టేవారు అని చెప్పుకొచ్చింది.