Rajitha Chanti |
Jun 08, 2022 | 9:20 PM
ఖుషి, యశోధ సినిమాలతో బిజీగా సామ్ ఇప్పుడు రూటు మార్చింది. తెలుగులోనే కాకుండా.. తమిళంలో, బాలీవుడ్లోనూ వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది. విడాకుల ప్రకటన అనంతరం సామ్ స్పీడ్ పెంచింది.
తెలుగులోనే కాకుండా.. తమిళంలో, బాలీవుడ్లోనూ వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది. అయితే దక్షిణాది చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సామ్.. ఇప్పటివరకు మలయాళంలో మాత్రం సినిమా చేయలేదు..
లేటేస్ట్ టాక్ ప్రకారం సమంత ఇప్పుడు మలయాళ అరంగేట్రానికి సిద్ధమయ్యిందట.. మాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ డైరెక్టర్ షాజీ కైలస్ పింక్ పోలీస్ పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమా లేడీ ఓరియెంటెడ్ నేపథ్యంలో రాబోతుంది. అయితే ఇందులో కథానాయికగా నటించనుందని తెలుస్తోంది. ఇప్పటికే సమంతతో చిత్రయూనిట్ సంప్రదింపులు జరిపిందని. కథతోపాటు.. తన పాత్రలోని వైవిధ్యం నచ్చడంతో ఈ సినిమాకు సామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమాను తెలుగు, తమిళంసో, హిందీ భాషల్లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఈ ఏడాది చివరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుందని సమాచారం.
ప్రస్తుతం సామ్ చేస్తోన్న యశోధ, ఖుషి సినిమాల చిత్రీకరణ అనంతరం తన తదుపరి ప్రాజెక్ట్స్ పై ఫోకస్ చేయనున్నట్లుగా తెలుస్తోంది.