Rajeev Rayala |
Dec 16, 2024 | 8:42 PM
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన గురు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది వయ్యారి భామ రితిక సింగ్. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. తొలి సినిమానే అయినా.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది రితిక.
ఇక అందాల భామ రితికా సింగ్ 16 డిసెంబర్ 1994న ముంబైలో జన్మించింది. నేడు ఈ ముద్దుగుమ్మ పుట్టిన రోజు. రితిక నటి మాత్రమే కాదు ఆమె గొప్ప మార్షల్ ఆర్టిస్ట్ కూడా.. చిన్నప్పటి నుంచి ఈ ముద్దుగుమ్మకు క్రీడలంటే మక్కువ ఎక్కువ. అంతే కాదు ఆమె బాక్సర్ కూడా..
అతను 2009లో ఆసియా ఇండోర్ గేమ్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అలాగే సూపర్ ఫైట్ లీగ్‌ను గెలిచింది. దీని తరువాత, ఆమె సుధా కొంగర దర్శకత్వం వహించిన "ఇరుతి చూడ్" చిత్రంలో ప్రధాన పాత్రలో నటించడంతో నటిగా అరంగేట్రం చేసింది. అదే సినిమా గురు టైటిల్ తో తెలుగులో రీమేక్ అయ్యింది.
మొదట్లో నటనపై ఆసక్తి లేని రితిక తన మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. తొలి సినిమానే సంచలన విజయం సాధించింది. స్పోర్ట్స్ తో పాటు ఆమె సినిమాలలో నటించడానికి ఆసక్తిని చూపించింది.
రజనీకాంత్, రాఘవ లారెన్స్, మాధవన్, విజయ్ సేతుపతి, దుల్కర్ సల్మాన్ , విజయ్ ఆంటోని వంటి చాలా మంది నటుల చిత్రాలలో నటించింది ఈ చిన్నది. ఇక సోషల్ మీడియాలో రితిక షేర్ చేసే ఫోటోలు అభిమానులను కవ్విస్తుంటాయి.