
టాలీవుడ్‌లో వరసగా సినిమాలు చేసి మంచి హిట్ అందుకొని, ఇండస్ట్రీకి దూరమైన ముద్దుగుమ్మల్లో రెజీనా ఒకరు. ఈ ముద్దుగుమ్మ గురించి ఎంత చెప్పినా తక్కవే. అందం, అభినయం ఈ అమ్మడు సొంతం. ఈ బ్యూటీ తన అంద చందాలతో ఎంతో మంది మదిని దోచుకుంది.

పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఈ మూవీ తర్వాత ప్రతి ఒక్కరూ ఈ బ్యూటీ లైఫ్ టర్న్ అవుతుంది అనుకున్నారు. కానీ ఈ సినిమా తర్వాత వరసగా సినిమాలు చేసినప్పటికీ ఊహించిన అవకాశాలు అందుకోలేకపోయింది.

రెజీనా ఈ సినిమా తర్వాత సుబ్రమణ్యం ఫర్ సేల్, సౌఖ్యం, కొత్త జంట, రొటీన్ లవ్ స్టోరీ, వంటి చాలా సినిమాల్లో నటించింది. కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించింది. అయినప్పటికీ ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాట లేకపోయింది.

ఇక తెలుగులో అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్ చెక్కేసి, అక్కడ వరసగా సినిమాలు చేస్తూ గడిపేస్తుంది. ఇక ఈ మధ్య ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన బ్యూటిపుల్ ఫొటోస్ షేర్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ చిన్నది స్టైలిష్ లుక్‌లో ఉన్న ఫొటోలు అభిమానులతో పంచుకుంది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. సింపుల్ లుక్‌లో బ్యూటిపుల్, క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ ముద్దుగుమ్మ అభిమానులు.