
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఫుల్ డిమాండ్ ఉన్న హీరోయిన్లలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఒకరు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్‌గా మారిపోయిన ఈ అందాల తార ప్రస్తుతం దక్షిణాదితో పాటు హిందీలోనూ వరుసగా సినిమాలు చేస్తోంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు మరో తెలుగు స్టార్ హీరోతో నటించేందుకు రష్మిక మందన్న సిద్ధమైందని సమాచారం. ఇంతకీ ఈ హీరో మరెవరో కాదు మాస్ మహరాజా రవితేజ. బలుపు, క్రాక్ సినిమాల తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేని- రవితజ మరో కొత్త సినిమా చేస్తున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది.

అయితే ఈ క్రేజీ ప్రాజెక్టులో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనే దానిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అయితే సినిమా వర్గాల సమాచారం ప్రకారం రష్మిక మందన్నను ఎంపిక చేయడానికి చిత్ర బృందం ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది.

రవితేజ, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘ధమాకా’. రవితేజ, గోపీచంద్‌ల సినిమాలో ఇదే జోడీ మళ్లీ రిపీటవుతుందని భావించారు. అయితే ఇప్పుడు దర్శకుడు శ్రీలీలకి బదులుగా రష్మికను తీసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. రెమ్యునరేషన్ ఎంత అడిగినా ఇచ్చేందుకు రెడీగా కూడా ఉన్నారట.

ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఓ ముఖ్య పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ఇక రష్మిక నటిస్తున్న 'పుష్ప 2' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. అలాగే రణ్‌బీర్ కపూర్‌తో నటిస్తోన్న ‘యానిమల్’ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇది డిసెంబర్ 1న విడుదల కానుంది.