
బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తున్న ముద్దుగుమ్మ రష్మీ.. ఈ చిన్న పలు టీవీ షోలతో బిజీ బిజీగా గడిపేస్తుంది. యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. ముఖ్యంగా జబర్దస్త్ వల్ల ఈ కుర్రదానికి మంచి పాపులారిటీ వచ్చింది.

యాంకర్ గానే కాదు సినిమాల్లోనూ కనిపిస్తూ ఆకట్టుకుంటుంది రష్మీ. ఇక ఈ చిన్నదానికి సంబందించిన ఫోటోలు, న్యూస్ నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. సమాజంలో జరిగే చాలా విషయాల పై రష్మీ తనదైన స్టైల్ లో స్పందిస్తూ ఉంటుంది.

అలాగే రష్మీకి జంతువులు అంటే ఎంత ప్రేమో అందరికి తెలుసు. జంతువుల గురించి నిత్యం రకరకాల పోస్ట్ లు షేర్ చేస్తూ ఉంటుంది రష్మీ. తాజాగా ఓ నెటిజన్ రష్మీ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఏకంగా చెప్పుతో కొడతా అని రెచ్చిపోయాడు.

రష్మీ సోషల్ మీడియాలో ఓ ఆవుకు సంబందించిన వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో ఓ వ్యక్తి ఆవును చంపుతూ కనిపించాడు. దీనిపై నెటిజన్ రకరకాలుగా స్పందిస్తున్నారు . ఓ నెటిజన్ మాత్రం కాస్త ఘాటుగానే స్పందించాడు.

దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆడవాళ్లను, చిన్న పిల్లలను రేప్ చేస్తున్నారు. మహిళలను నగ్నంగా రోడ్లపై తిప్పుతున్నారు .. వాటి గురించి మాట్లాడవేం.. నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి అని రాసుకొచ్చాడు. దీని రష్మీ స్పందిస్తూ.. ఈ రోజు అవును చంపినా వాడే రేపు నీ పిల్లలని చంపుతాడు అని రిప్లే ఇచ్చింది.