
సిల్వర్ స్క్రీన్ మీద కెరీర్ స్లో అవుతుందేమో అన్న అనుమానం వస్తే చాలు వెంటనే సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోతున్నారు బ్యూటీస్. ఒకప్పుడు స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేసిన హీరోయిన్లు కూడా చిన్న చిన్న పొరపాట్లతో కెరీర్‌ను ఇబ్బందుల్లో పడేసుకుంటున్నారు.

అలా కెరీర్‌లో తడబడిన రకుల్, తన కెరీర్ ఎర్లీ డేస్ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. టాలీవుడ్‌లో టాప్ స్టార్స్ అందరితో స్క్రీన్ షేర్ చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ ఆశలతో సౌత్ సినిమాకు దూరమయ్యారు.

సౌత్‌లో ఫుల్ ఫామ్‌లో ఉన్న టైమ్‌లోనూ ముంబై ఫ్లైట్ ఎక్కేయటంతో రకుల్‌ను సౌత్ మేకర్స్ పక్కన పెట్టేశారు. బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్నా... స్టార్ ఇమేజ్ మాత్రం అందుకోలేకపోతున్నారు రకుల్.

లీడ్ రోల్స్‌లో నటించిన సినిమాలు సక్సెస్ అవ్వకపోవటం, సక్సెస్ అయిన సినిమాలో సపోర్టింగ్ రోల్స్‌కే పరిమితమవ్వటంతో నార్త్‌లోనూ రకుల్ గ్రాఫ్ ఆశించిన స్థాయికి రాలేదు.

ఈ టైమ్‌లో తన కెరీర్ ఎర్లీ డేస్ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు రకుల్ ప్రీత్ సింగ్. ఇండస్ట్రీలో హీరోయిన్‌గా సక్సెస్ అవ్వటం అంటే అంత ఈజీ కాదంటున్నారు భ్రమరాంభ. తాను కూడా ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసిన తరువాతే ఈ స్థాయికి వచ్చా అన్నారు.

అవకాశాల కోసం డైరెక్టర్లు, ప్రొడక్షన్ హౌస్‌ల చుట్టూ తిరిగానని, కొన్నిసార్లు అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి తరువాత తన ప్లేస్‌లో వేరే హీరోయిన్‌ను తీసుకునే వారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు అవన్నీ దాటి సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా ప్రూవ్ చేసుకోవటం గర్వంగా ఉందన్నారు రకుల్.