రకుల్ ప్రీత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన ఆవరసం లేదు. కెరటం అనే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది రకుల్. ఆతర్వాత వచ్చిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తర్వాత వరుస సినిమాలతో టాలీవుడ్ లో బిజీగా మారిపోయింది. తక్కువ సమయంలోనే రకుల్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. దాదాపు టాలీవుడ్ యంగ్ హీరోలందరి సరసన సినిమా చేసింది .
తెలుగుతోపాటు తమిళ్ లోనూ సినిమాలు చేసి మెప్పించింది రకుల్ ప్రీత్. అటు హిందీలోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. బాలీవుడ్ లో కొన్ని వెబ్ సిరీస్ లోనూ కనిపించనుంది రకుల్.
నేడు ఈ ముద్దుగుమ్మ పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ చెప్తున్నారు అభిమానులు, పలువురు మూవీ సెలబ్రెటీలు.
ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేవు. తమిళ్ లో ఇండియన్ 2 సినిమాలో నటిస్తుంది రకుల్. అలాగే శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న సినిమాలోనూ హీరోయిన్ గా చేస్తోంది రకుల్.