కేరళకు చెందిన ప్రియమణి 2003లో వచ్చిన `ఎవరే అతగాడు?` చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది ఈ బ్యూటీ.
ఆ తర్వాత 'పెళ్ళైనకొత్తలో` చిత్రంతో గుర్తింపు దక్కించుకుంది. ఈ మూవీ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన `యమదొంగ`లో నటించింది.
ఆతర్వాత వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ హోదాను దక్కించుకున్న ప్రియమణి.. 2017లో చాలా సైలెంట్గా ముస్తాఫాను వివాహం చేసుకుంది.
ప్రస్తుతం ఈమె ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు బుల్లితెరపై టీవీ షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తూ ఫుల్ బిజీగా ఉంది ఈ అమ్మడు. ప్రియమణి నటించిన తాజా చిత్రం `భామా కలాపం`. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్గా రూపుదిద్దుకున్న మూవీ ఇది.
ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో ఫిబ్రవరి 11న విడుదలైన ఈ మూవీ విశేష ఆదరణను సొంతం చేసుకుంది.
తాజాగా ప్రియమణి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమాలో అనుపమ ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటుంది. కానీ రియల్ లైఫ్లో నేనంతగా జోక్యం చేసుకోను. నాది అలాంటి క్యారెక్టర్ కానే కాదు. నాలుగేళ్లుగా నా పక్కింట్లో ఎవరు ఉంటున్నారో కూడా నాకు తెలియదు అని తెలిపింది ప్రియమణి