5 / 5
రణవీర్ సింగ్ సరసన సర్కస్, ప్రభాస్ సరసన రాధే శ్యామ్, అఖిల్ అక్కినేని సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, సల్మాన్ ఖాన్ సరసన కిజీ కా భాయ్ కిజీ కి జాన్ వంటి హిట్ చిత్రాలలో నటించిన పూజా రీసెంట్ గా చిన్న బ్రేక్ తీసుకొని ఇప్పుడు తిరిగి సినిమాల్లో బిజీ అయ్యింది. తాజాగా పూజా సూర్య 44తో కోలీవుడ్‌లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సూర్య సరసన పూజా హెగ్డే నటిస్తోంది. తాజాగా పూజా తన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసింది.