
సినిమా ఇండస్ట్రీలో మల్టీటాలెంటడ్ యాక్టర్స్‌లో నిత్యా మీనన్ ఒకరు. తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ చిన్నది. నాని హీరోగా నటించిన అలామొదలైంది సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ఈ అమ్మడు. ఆతర్వాత చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ మధ్య కాలంలో సినిమాల స్పీడ్ తగ్గించింది. ఆచి తూచి సినిమాలు చేస్తుంది ఈ అమ్మడు. గతంలో నిత్యా మీనన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

నిత్యామీనన్ తన పేరు గురించి ఆసక్తికర విషయం చెప్పుకొచ్చింది. తన పేరు నిజంగా నిత్యా మీనన్ కాదని చెప్పింది ఈ అమ్మడు. అందరూ నన్ను మలయాళీ భామ అనుకుంటున్నారు. అందరూ అలా అనుకుంటుంటే నాకు నవ్వొస్తుంది. నా అసలు పేరు ఎన్.ఎస్.నిత్య అని తెలిపింది ఈ ముద్దుగుమ్మ. తమిళ్‌లో ధనుష్ నటించిన తిరుచిత్రంబలం చిత్రానికి జాతీయ అవార్డును గెలుచుకున్న నిత్యా ఇప్పుడు మలయాళంలో నటించడం ప్రారంభించింది.

గతంలో నిత్య మీనన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన తండ్రి అయ్యర్ వర్గానికి చెందిన వారని, తల్లి మీనన్ వర్గానికి చెందినవారని తెలిపింది. అయితే ఇద్దరూ వేరు వేరు కులాలకు చెందినవారు కావడంతో.. నిత్యా పేరెంట్స్ తన పేరులో కులం ఉండకూడదనుకున్నారు. అందుకే తన తల్లిదండ్రులు పెట్టిన పేరు ఎన్ఎస్ నిత్య అని తెలిపింది. ఎన్ అంటే నళిని తల్లి పేరు అలాగే ఎస్ అంటే సుకుమార్ తండ్రి పేరు అని తెలిపింది నిత్యా.

ఇలా ఇద్దరి పేర్లు కలుపుకొని ఎన్ఎస్ నిత్య అని పెట్టుకున్న అని తెలిపింది. కుటుంబసభ్యులు అధికారికంగా పెట్టిన పేరు ఇదేనని కూడా నిత్య చెప్పింది. మా ఫ్యామిలీలో ఇంటిపేర్లను వాడరు. కులాన్ని పేర్లతో ముడిపెట్టడం మా ఇంట్లో ఇష్టం ఉండదు. అయితే.. వృత్తి రీత్యా దేశవిదేశాలు తిరగాల్సిరావడంతో తప్పనిసరై పాస్‌పోర్ట్‌లో నా పేరుకు ‘మీనన్’ని జత చేశా.దీంతో నిత్య తన పేరుకు మీనన్ అనే రెండో పేరు చేర్చాలని నిర్ణయించుకున్నా అని తెలిపింది.

కాగా తాను మలయాళీ కానప్పటికీ తన పేరు నిత్యా మీనన్ గా మారిపోయిందని చెప్పుకొచ్చింది నిత్యామీనన్. ఇక నిత్యా సినిమాల విషయానికొస్తే.. ఈ అమ్మడు ఆచితూచి సినిమాలు చేస్తుంది. అలాగే సినిమా సినిమాకు చాలా గ్యాప్ నిస్తుంది ఈ చిన్నది . అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ వయ్యారి భామ.