
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే వరుస సినిమాలతో దూసుకుపోతుంది హీరోయిన్ నిధి అగర్వాల్. హరిహర వీరమల్లు సినిమాతో అలరించిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల సంక్రాంతి పండక్కి రాజాసాబ్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది.

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే.. రాజాసాబ్ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిధి.. తనకు ఆల్కహాల్ అలవాటు ఉందని తెలిపింది. 14 ఏళ్ల వయసులోనే స్టార్ట్ చేసినట్లు చెప్పుకొచ్చింది.

ఆ సమయంలో తన స్నేహితులతో కలిసి ఆల్కహాల్ తాగడం ఫన్ గా ఉండేదని.. అప్పట్లో ఆల్కహాల్ తాగుతూ ఎంజాయ్ చేసినట్లు వెల్లడించింది. కానీ కొన్నేళ్ల తర్వాత ఆల్కహాల్ తనకు పడలేదని.. ఆ విషయం అర్థమైందని.. అప్పటి నుంచి మానేసినట్లు తెలిపింది.

మెల్లగా మందు తాగడం మానేశానని.. చివరగా ఆల్కహాల్ తాగి ఆరేళ్లు అయ్యిందని తెలిపింది. పార్టీలకు వెళ్లడం ఆల్కహాల్ తాగడం మానేశానని.. ఇప్పుడు తాను పార్టీలకు వెళ్లినా మందు తాగడం లేదని తెలిపింది. కేవలం గ్రీన్ టీ మాత్రమే తీసుకుంటానని అన్నారు.

చాలా కాలంగా సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది నిధి అగర్వాల్. హిట్టు రాకపోయినా.. అవకాశాలు మాత్రం క్యూ కడుతున్నాయి. తెలుగుతోపాటు ఈ అమ్మడు తమిళంలోనూ పలు చిత్రాల్లో నటిస్తూ అలరిస్తుంది ఈ వయ్యారి.