
వరుణ్ తేజ్ హీరోగా నటించిన గద్దల కొండా గణేష్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది మృణాళిని రవి.

ఈ సినిమాలో బుజ్జమ్మ అనే పాత్రలో చక్కగా నటించి మెప్పించింది. ఆతర్వాత ఈ చిన్నది తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు.

తమిళ్ లోనే ఎక్కువ సినిమాలు చేస్తుంది మ్రిణాలిని రవి. అక్కడ మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు అందుకొని దూసుకుపోతోంది.

ఇక ఈ అమ్మడు తెలుగులో మంచి ఛాన్స్ వస్తే నటించాలని చాలా కాలంగా ఎదురుచూస్తుంది. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుంది మృణాళిని .

మృణాళిని రవి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అభిమానులను రకరకాల ఫొటోలతో అలరిస్తూ ఉంటుంది ఈ అమ్మడు.