
మేఘా ఆకాష్ ప్రధానంగా తెలుగు, తమిళ చిత్రాలలో నటిస్తుంది. ఆమె 1995 అక్టోబర్ 26న చెన్నైలో జన్మించింది. తండ్రి తెలుగు, తల్లి మలయాళీ, ఇద్దరూ ప్రకటనల రంగంలో పనిచేస్తారు. మేఘా చెన్నైలోని లేడీ ఆండల్ స్కూల్ మరియు మహిళా క్రిస్టియన్ కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్స్‌లో బీ.ఎస్సీ పూర్తిచేసింది.

2017లో నితిన్ సరసన "లై" అనే తెలుగు చిత్రంతో సినీ రంగంలో అడుగుపెట్టింది. ఈ చిత్రం విజయం సాధించకపోయినా, ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. SIIMA అవార్డు ఉత్తమ తొలి నటిగా నామినేషన్ అందుకుంది.

ఆ తర్వాత "ఛల్ మోహన్ రంగ" (2018), "రాజ రాజ చోర" (2021), "డియర్ మేఘా" (2021) వంటి తెలుగు చిత్రాలతో పాటు తమిళంలో "పెట్టా" (2019), "ఎనై నోక్కి పాయుమ్ తోట" (2019), హిందీలో "సాటిలైట్ శంకర్" (2019) చిత్రాలలో నటించింది.

ఇక సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. చీరకట్టులో ఓ వైపు అందాలతో ఆకట్టుకుంటూ.. మరో వైపు మోడ్రన్ డ్రస్స్ లో మెరిపిస్తుంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ క్రేజీ ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ చిన్నదాని ఫోటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. కుర్రకారు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.