
అందాల నటి మీనా ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా రాణించారు. ఇప్పటికే అదే సౌందర్యంతో చూడచక్కని రూపంతో ఆకట్టుకుంటున్నారు మీనా.

ఇక మీనా పలు తెలుగు, తమిళ చిత్రాలలో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేశారు.

నేడు ఈ అందాల నటీమణి పుట్టిన రోజు.. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి ఆకట్టుకున్నారు మీనా.

కొంతకాలం గ్యాప్ తీసుకున్న మీనా ఇప్పుడు తిరిగి సినిమాల్లో నటిస్తున్నారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న అన్నతే సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు మీనా

ఇక సోషల్ మీడియాలో మీనాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు పలువురు ప్రముఖులు.