
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే రాజాసాబ్ మూవీ విడుదల కానుంది. మరోవైపు త్వరలోనే స్పిరిట్ మూవీ పట్టాలెక్కనుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ ఎంపిక చేయగా.. ఇప్పుడు మలయాళీ కుట్టి సైతం జాయిన్ కానుందట.

ఈ సినిమాలో ప్రభాస్ కు తండ్రిగా మెగాస్టార్ చిరంజీవి నటించనున్నారనే వార్త తెగ వైరలవుతుందియి. అయితే దీనిపై క్లారిటీ రాలేదు. ఇక ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో కీలక పాత్ర కోసం మలయాళీ బ్యూటీ మడోన్నా సెబాస్టియన్ ను ఎంపిక చేశారట.

గతంలో న్యాచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగరాయ్ చిత్రంలో లాయర్ పాత్రలో అదరగొట్టింది మడోన్నా. ఆ తర్వాత లియో చిత్రంలో విజయ్ చెల్లెలిగా అలరించింది. ఇక ఇప్పుడు స్పిరిట్ మూవీలో భాగం కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకనట రాలేదు.

మలయాళంలో ప్రేమమ్ సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకుంది మడోన్నా. తెలుగులో ప్రేమమ్ రీమేక్ లో నాగచైతన్యతో కలిసి నటించింది. అయితే అందం, అభినయంతో నటిగా మంచి మార్కులు కొట్టేసినప్పటికీ ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు.

ఇక ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ రావడంతో ఈ బ్యూటీ దశ తిరిగినట్లే అని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఇందులో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు ప్రభాస్.