
టాలీవుడ్ హీరోయిన్ లయ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. చే సింది తక్కువ సినిమాలే అయినా తనదైన అందం, అభినయంతో ప్రేక్షకును కట్టిపడేసిందీ అందాల తార.

అయితే కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైందీ అందాల తార. 2006లో అమెరికాకు చెందిన డాక్టర్ శ్రీ గణేశన్ ను వివాహం చేసుకున్న లయ ఆ తర్వాత అక్కడే సెటిల్ అయ్యింది.

ప్రస్తుతం లయ దంపతులకు ఓ పాప, బాబు ఉన్నారు. కాగా పెళ్లి, పిల్లల తర్వాత గ్యాప్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ రీ ఎంట్రీకి రెడీ అయిపోయింది.

నితిన్ హీరోగా నటిస్తోన్న రాబిన్ హుడ్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది లయ. అలాగే బిగ్ బాస్ ఫేమ్ నటుడు శివాజీతో కలిసి మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనుంది.

ఇదిలా ఉంటే దీపావళి ని పురస్కరించుకుని లయ షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. ఇందులో పింక్ కలర్ శాలరీలో ఎంతో అందంగా కనిపించిందీ ముద్దుగుమ్మ.