కియారా అద్వానీకి కలిసి రాని టాలీవుడ్.. మూడు సినిమాలు చేస్తే ఒకేఒక్క హిట్

Updated on: Dec 31, 2025 | 1:46 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది కియారా అద్వానీ. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. భరత్ అనే నేను సినిమాలో తన అందంతో, నటనతో ప్రేక్షకులను కవ్వించింది ఈ భామ.

1 / 5
సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది కియారా అద్వానీ. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. 

2 / 5
భరత్ అనే నేను సినిమాలో తన అందంతో, నటనతో ప్రేక్షకులను కవ్వించింది ఈ భామ. ఒకే ఒక్క సినిమాతో తెలుగు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ అయ్యింది. ఆతర్వాత రామ్ చరణ్ తో కలిసి వినయ విధేయ రామ అనే సినిమా చేసింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. 

3 / 5
వినయవిధేయ రామ డిజాస్టర్ అవ్వడంతో ఈ భామ తిరిగి బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అక్కడ వరుస సినిమాలతో పాటు అక్కడి హీరో సిద్దార్థ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్లాడింది కియారా అద్వానీ. 

4 / 5
ఇక రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమాతో మరోసారి తెలుగులోకి అడుగుపెట్టింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డబుల్ డిజాస్టర్ అయ్యింది. దాంతో తెలుగు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది కియారా. మొన్నామధ్య ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమా కూడా తెలుగులో రిలీజ్ అయ్యింది. 

5 / 5
కానీ వార్ 2 కూడా డిజాస్టర్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ యష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ అనే సినిమాలో నటిస్తుంది.. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ పడటంతో ఈ భామకు తెలుగులో ఆఫర్స్ తగ్గిపోయాయి అని టాక్ ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. 