అందం, టాలెంట్ ఎంత ఉన్నా..అవగింజంత అదృష్టం కూడా ఉండాలంటారు. మరీ ముఖ్యంగా నటనా ప్రపంచంలో ఉన్నవారికి అదృష్టం కాస్త వెంట ఉండాల్సిందే. లేదంటే.. చూపు తిప్పుకోనివ్వని అందం.. ఎంత టాలెంట్ ఉన్నా అవకాశాలు మాత్రం అమాడ దూరంలో ఉండిపోతాయి. అలాంటి తారల జాబితాలో కాశ్మీరా పరదేశి ఒకరు.
కాశ్మీర పరదేశి.. మరాఠీ అమ్మాయి. ప్రస్తుతం తెలుగు.. తమిళ్.. కన్నడ ఇండస్ట్రీలలో వరుస చిత్రాలతో అలరిస్తుంది. చేతి నిండా సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. అనుకున్నంత స్థాయిలో మాత్రం గుర్తింపు రాలేదు.
నర్తనశాల సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత మిషన్ మంగల్.. రైడర్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.
ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో నాలుగైదు చిత్రాలున్నాయి. అందులో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తోన్న వినరో భాగ్యము విష్ణు కథ చిత్రం కూడా ఒకటి.
ఈచిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో మురళీ కిషోర్ అబ్బురు దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.
తాజాగా సంక్రాంతి సందర్భంగా కాశ్మీరా పరదేశీ షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
తాజాగా సంక్రాంతి సందర్భంగా కాశ్మీరా పరదేశీ షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
తాజాగా సంక్రాంతి సందర్భంగా కాశ్మీరా పరదేశీ షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.