Rajitha Chanti | Edited By: Anil kumar poka
Nov 18, 2022 | 3:55 PM
సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. సరోగసి నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ మూవీలో సామ్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరోవైపు కొద్ది రోజులుగా సామ్ మయోసైటిస్ సమస్యతో బాధపడుతోంది. ఇటీవల చేతికి సెలైన్ పెట్టుకుని యశోద చిత్రానికి డబ్బింగ్ చెబుతున్న ఫోటో షేర్ చేస్తూ తన వ్యాధి గురించి ప్రకటించింది. దీంతో సామ్ త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థిస్తున్నారు ఫ్యాన్స్.
తాజాగా సమంత మయోసైటిస్ సమస్య పై ఆసక్తికర కామెంట్స్ చేసింది నటి కల్పిక. యశోద సినిమా సక్సెస్‌మీట్‌లో మాట్లాడిన కల్పిక .. తను కూడా సమంత లాగే ఆ వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించింది. ఈ కార్యక్రమానికి సామ్ హాజరుకాలేదు.
తాము సమంతను మిస్ అవుతున్నామని.. ఆమె సక్సె్స్ మీట్ కు వస్తున్నారని నాకు అబద్ధం చెప్పారు. నాకు ఆసుపత్రిలో అపాయింట్మెంట్ ఉన్నా.. వదిలేసి ఆమె కోసం వచ్చానని అన్నారు కల్పిక.
సమంతకు ఉన్న మయోసైటిస్ తనకు గత 13 ఏళ్లుగా ఉందని.. ఇప్పుడు తను ఫస్ట్ స్టేజ్ లో ఉందని.. కానీ సమంత థర్డ్ స్టేజ్ లో ఉందని వెల్లడించింది.
డైరెక్టర్స్ హరి , హరీష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సామ్ గర్భవతిగా నటించింది. ఇందులో ఉన్ని ముకుందన్.. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రలలో నటించారు.
పాన్ ఇండియా లెవల్లో ఐదు భాషల్లో విడుదలైన ఈసినిమా ఇప్పిటివరకు రూ. 20 కోట్ల వరకు కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై రూ. 30 కోట్లతో నిర్మించారు.
ఆమెకు మయోసైటిస్ థర్డ్ స్టేజ్‌లో ఉంది.. షాకింగ్ కామెంట్స్ చేసిన యశోద నటి కల్పిక..